ఆమిర్ ఖాన్ డాటర్ ఐరాఖాన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?

 ఆమిర్ ఖాన్ డాటర్ ఐరాఖాన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?

బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్(Aamir Khan) తన పర్సనల్‌ లైఫ్‌ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. లాల్‌ సింగ్‌ చద్దా మూవీ  తర్వాత విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. అంతకుముందు అతని భార్య కిరణ్‌ రావుతోనూ విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచారు.

లేటెస్ట్ గా తన కూతురు ఐరాఖాన్(Ira Khan) మ్యారేజ్ ఫిక్స్ అయినట్లు తెలిపారు.  ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే(Nupur Shikhare)తో..తన కూతురు ఐరాకి వచ్చే నెల నవంబర్18న నిశ్చితార్థం, వచ్చే ఏడాది 2024 జనవరి 3న మ్యారేజ్ జరగనున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ALSO READ: నేను దిశా పటానీని.. అయితే ఏంది ! చూపించాల్సిందే..

అలాగే ఐరాఖాన్ ప్రేమించిన  అబ్బాయిని.. సెలెక్ట్ చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నాను..వారు కలిసి జీవితం పంచుకోవడం తనను ఎంతో హ్యాపీగా ఉండేలా చేసిందని..వీరిద్దరు ఎంతో బాగా కనెక్ట్ అయ్యారని, జీవితంలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ లో నుపుర్ తన వెంటే నిలబడతాడనే నమ్మకం ఉందని ఆమీర్ ఖాన్ వెల్లడించారు. ఎందుకంటే, ఐరాఖాన్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు నుపుర్ అందించిన మనో ధైర్యం ఎంతో మేలు చేసిందని..కనుకే తన కూతురు త్వరగా కోలుకుంటున్నట్లు తెలిపారు.

నుపుర్ శిఖరే ఫేమస్ సెలబ్రెటీస్ కు ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేశారు. నుపుర్ తనకు కుమారుడితో సమానమని ఆమిర్ పేర్కొన్నారు. అతడ్ని తమ కుటుంబ సభ్యుడిగానే భావిస్తున్నట్టు చెప్పారు. నుపుర్ తల్లి ప్రీతమ్ జీ ఇప్పటికే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని అన్నారు.  

ఆమిర్ ఖాన్..నాగ చైతన్య తో కలిసి చేసిన లాల్‌ సింగ్‌ చద్దా తర్వాత కొత్త మూవీని ప్రకటించలేదు. ఐరాఖాన్ మ్యారేజ్ తర్వాత..ఆమిర్ ఖాన్ నుంచి కొత్త మూవీ అప్డేట్ వచ్చే అవకాశం కన్పిస్తోంది.  .

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)