ఆఫీసు పని కంటే పర్సనల్ లైఫ్ ముఖ్యమని భావించే ఈ రోజుల్లో, ఒక 'జెన్ జీ' (Gen Z) ఉద్యోగి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయింది. సిమ్రాన్ అనే యువతి తన ట్రిప్ కోసం కొన్ని వారాల ముందే మేనేజర్‌కు సెలవు గురించి చెప్పింది. అప్పుడు మేనేజర్ ఏమీ అనకుండా సరే అని ఓకే చేసారు.
కానీ తీరా ఆమె ఫ్లైట్ ఎక్కే సమయానికి, ఆఫీసులో పని ఉంది, నీ లీవ్ క్యాన్సిల్ చేస్తున్నాం, వెంటనే రావాలి అని మెసేజ్ పంపారు. దీనికి ఆమె.. ఐ డోంట్ కేర్ (నాకు సంబంధం లేదు) అన్నట్లుగా రియాక్ట్ అయి ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సిమ్రాన్ ప్రకారం... నా ప్రయాణ ప్లాన్ గురించి చాల రోజుల ముందే చెప్పాను, చివరి నిమిషంలో లీవ్ క్యాన్సిల్ చేయడం ఏంటని ఆమె ప్రశ్నించింది. ఉద్యోగుల వ్యక్తిగత సమయానికి ఆఫీసుల్లో విలువ ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నేను నా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఉద్యోగం చేస్తున్నాను, అంతే తప్ప 24 గంటలు ఆఫీస్ కోసం బతకలేను అని తేల్చి చెప్పింది.
సోషల్ మీడియాలో చర్చ :
ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేసారు. కొందరు ఆఫీస్ పనుల కోసం పర్సనల్ ప్లాన్స్ క్యాన్సల్ చేసుకోవద్దని అనగా... మేనేజర్లు ముందే ప్లాన్ చేసుకోవాలి, చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టకూడదు అంటూ... వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం అని అన్నారు.
►ALSO READ | NCERT పుస్తకం వివాదం.. 8వ తరగతి పుస్తకాల అమ్మకాలు నిలిపివేత
మరికొందరు దీనిని తప్పుపడుతూ.. సెలవు పేపర్ మీద ఆఫీషియల్‌గా శాంక్షన్ అయిందా లేదా అని ప్రశ్నించగా ?... పర్మిషన్ రాకుండానే టికెట్లు బుక్ చేసుకోవడం ఉద్యోగి తప్పే కదా ? అని అన్నారు... ఇంకొందరు అత్యవసర పరిస్థితుల్లో ఆఫీస్ బాధ్యత కూడా తీసుకోవాలి అని సలహా ఇచ్చారు.
ఒకప్పుడు బాస్ ఏం చెప్పినా "సరే" అనే రోజులు ఉండేవి. కానీ ఇప్పటి జనరేషన్ (Gen Z) మాత్రం ఇలాంటి విషయంలో చాలా స్పష్టంగా ఉంటున్నారు. ఆఫీస్ పని ఆఫీస్ వరకే, పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫే అని గట్టిగా చెబుతున్నారు.
