కంప్యూటర్ టేబుల్ వాడేటోళ్లకు పనికొచ్చే కేబుల్ క్లిప్స్.. ధర ఇంత తక్కువ.. ?

కంప్యూటర్ టేబుల్ వాడేటోళ్లకు పనికొచ్చే కేబుల్ క్లిప్స్.. ధర ఇంత తక్కువ.. ?

కొందరు కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఐ, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నింపేస్తుంటారు. వాటిని ఎక్కడికక్కడ సర్ది పెట్టినా మళ్లీ కొన్నాళ్లకు పరిస్థితి మొదటికొస్తుంది. అలాంటివాళ్లకు ఈ కేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బాగా పనికొస్తాయి. వీటిని రోకొరెన్ అనే కంపెనీ ఇన్నోవేటివ్ స్ప్రింగ్ లాకింగ్ మెకానిజంతో తయారుచేసింది.  ఈ క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వెనుకభాగంలో యాక్రిలిక్ అడ్‌హెసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. సాధారణ డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే అతుక్కునే కెపాసిటీ 300 శాతం ఎక్కువ. 

►ALSO READ | టెక్నాలజీ: ఆపిల్ వాచ్ లో బీపీ నోటిఫికేషన్.. ఒఎస్ 26 అప్ డేట్.. అలెర్ట్ ఫీచర్ వచ్చేసింది..

వీటిని చెక్క టేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు గ్లాస్, సిరామిక్ టైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అతికించొచ్చు. సింపుల్‌గా వాటికి కేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగిలిస్తే చాలు. ఇవి 60 డిగ్రీల రొటేటబుల్ మాగ్నెటిక్ యాక్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తాయి. దానివల్ల కేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి విడదీయడం, తగిలించడం చాలా ఈజీ. ఆఫీస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడ్ టేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాండ్ లాంటివాటికి ఇవి బాగా సరిపోతాయి. ఒక్క సెకన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. వీటిని ఏబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాస్టిక్ మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారుచేశారు. కాబట్టి మన్నిక ఎక్కువ. 

ధర : 12 క్లిప్‌‌‌‌‌‌‌‌లకు రూ.  220