టెక్నాలజీ: ఆపిల్ వాచ్ లో బీపీ నోటిఫికేషన్.. ఒఎస్ 26 అప్ డేట్.. అలెర్ట్ ఫీచర్ వచ్చేసింది..

టెక్నాలజీ: ఆపిల్ వాచ్ లో  బీపీ నోటిఫికేషన్.. ఒఎస్ 26 అప్ డేట్.. అలెర్ట్ ఫీచర్ వచ్చేసింది..

ఆపిల్ కంపెనీ కొత్తగా వాచ్​ ఒఎస్​ 26 అప్​డేట్​ను పరిచయం చేసింది. హెల్త్​కు సంబంధించిన అలెర్ట్​ ఇచ్చే ఫీచర్​ను మనదేశంతోపాటు మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆపిల్ వాచ్​ హార్ట్​ డేటాను 30రోజుల పాటు అనాలసిస్​ చేసి యూజర్​ బ్లడ్​ ప్రెజర్​ గురించి సమాచారం ఇస్తుంది.

 ఎప్పుడూ బీపీ హైలోనే ఉంటే దాన్ని సూచించేలా నోటిఫికేషన్​ ద్వారా వార్నింగ్​ ఇస్తూ ఉంటుంది. ఈ ఫీచర్​ను వాడాలంటే ఆపిల్ వాచ్​ సిరీస్​ 9, అల్ట్రా 2, ఆ పై మోడల్స్, కొత్త వాచ్ ఒఎస్​ 26, ఐఫోన్​ 11, ఐఒఎస్ 26లలో మాత్రమే అందుబాటులో ఉంది. హైపర్ టెన్షన్ ఉందని డాక్టర్ చెకప్​ ద్వారా తెలుసుకున్నవాళ్లు నిరంతరం తమ హెల్త్​ కండిషన్​ని ఫాలో అప్​ చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. 

ఈ ఫీచర్ వాడాలంటే 22 ఏండ్లు దాటి ఉండాలి. ప్రెగ్నెంట్స్ వాడకూడదు. ఈ వాచ్​ని చేతికి పెట్టుకున్న తర్వాత రిస్ట్ డిటెక్షన్​ ఆన్​ చేయాలి. అందుకోసం ఐఫోన్​లో హెల్త్​ యాప్​ ఓపెన్ చేసి, ప్రొఫైల్​ ఐకాన్​ ద్వారా హెల్త్​ చెక్​ లిస్ట్​లో హైపర్ టెన్షన్​ నోటిఫికేషన్స్​ను సెలక్ట్​ చేసి, ఏజ్, హెల్త్ హిస్టరీ కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత 30 రోజుల డేటా ప్రకారం నోటిఫికేషన్స్ వస్తే.. వెంటనే డాక్టర్​ని కన్సల్ట్ అవ్వాలి. ఈ ఫీచర్​ను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోంది కంపెనీ.