పెర్త్: ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన ఆస్ట్రేలియా విమెన్స్ జట్టు ఇండియాతో జరిగిన డేనైట్ టెస్ట్‌లో10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 25 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం మూడో రోజు బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4.3 ఓవర్లలో 28/0 స్కోరు చేసింది. జార్జియా వోల్ (16 నాటౌట్), లిచ్‌ఫీల్డ్ (11 నాటౌట్) ఈజీగా విజయాన్ని అందించారు.
అంతకుముందు 105/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలో 149 రన్స్‌కే ఆలౌటైంది. ప్రతీకా రావల్ (63), స్నేహ్ రాణా (30) ఏడో వికెట్‌కు 50 రన్స్ జత చేశారు. కశ్వీ గౌతమ్ (0), సయాలీ (3) నిరాశపర్చారు. లూసీ హామిల్టన్ 3, సదర్లాండ్, అలనా కింగ్, గార్డ్‌నర్ తలా రెండు వికెట్లు తీశారు. సదర్లాండ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘సిరీస్’ అవార్డులు లభించాయి. ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ విజయంతో క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.
