ఈ మధ్య చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు తీయడానికి ప్రొఫెషనల్ కెమెరాకు బదులు ఫోన్లనే వాడుతున్నారు. అలాంటివాళ్లకు ఎదురయ్యే ప్రధాన సమస్య స్టోరేజీ. వీడియోలు, ఫొటోలు తీయడం వల్ల తరచూ ఫుల్ అవుతూ ఉంటుంది. క్లౌడ్‌లో స్టోర్ చేద్దామంటే అప్‌లోడింగ్‌కి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఈ అడాప్టర్‌ని వాడి డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇనిసియో అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది 8-ఇన్-1 మ్యాగ్‌సేఫ్ హబ్‌గా పనిచేస్తుంది.
M.2, ఎన్‌వీఎంఈ, ఎస్‌ఎస్‌డీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో చిన్న సైజు ఎన్‌వీఎంఈ ఎస్‌ఎస్‌డీ (ల్యాప్‌టాప్‌ల్లో వాడే హార్డ్ డ్రైవ్)ని ఇన్‌స్టాల్ చేసి ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. మ్యాగ్‌సేఫ్ మ్యాగ్నెట్ డిజైన్‌తో రావడం వల్ల దీన్ని ఐఫోన్ 16, 15 ప్రో/మ్యాక్స్ లాంటి ఫోన్‌ల వెనుక భాగంలో అతికించుకోవచ్చు.
►ALSO READ | చాట్ జీపీటీకి భారీ షాక్.. 25 లక్షల మంది బహిష్కరణ
ఇది యూఎస్‌బీ–సీ పోర్ట్ ద్వారా 10 జీబీపీఎస్ స్పీడ్‌తో డేటా ట్రాన్స్‌ఫర్ చేయగలదు. 4కే హెచ్‌డీఎంఐ, ఎస్‌డీ/టీఎఫ్ కార్డ్ రీడర్‌గా పనిచేస్తుంది. అంటే ఈ ఒక్క డివైజ్‌తో ఫోన్‌కు ఎక్స్‌ట్రా స్టోరేజ్, హెచ్‌డీఎంఐ టీవీ కనెక్షన్ ఇవ్వొచ్చు. దీన్ని ల్యాప్‌టాప్‌కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. విండోస్, మ్యాక్ ఓఎస్, లైనక్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
