చాట్ జీపీటీకి భారీ షాక్.. 25 లక్షల మంది బహిష్కరణ

చాట్ జీపీటీకి భారీ షాక్.. 25 లక్షల మంది బహిష్కరణ

అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకున్న అసంతరం ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. చాట్ జీపీటీని బహిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేసిన ఓ వెబ్ సైట్  అంచనా ప్రకారం ఇప్పటికే 25 లక్షల మందికి పైగా ఈ సేవలను వదిలివేసినట్లు పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ఈ సంఖ్యను వెల్లడించింది. పెంటగాన్ ఒప్పందం ద్వారా రహస్య నెట్ వర్క్  చాట్ జీపీటీని వినియోగించుకునే వీలుంటుందని సమాచారం. దీనిపై వినియోగ దారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. “ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చాట్ జీపీటీ వదిలేలా సంఘటితం చేస్తున్నాం" అని సదరు వెబ్సైట్ పేర్కొంది. 

ఈ పరిణామాల మధ్య ఆంత్రోపిక్ రూపొందించిన క్లాడ్ యాప్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఆపిల్ యాప్ స్టోర్ చార్ట్స్ లో చాట్ జీపీటీని దాటి క్లాడ్ అగ్రస్థానానికి చేరింది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం గత శనివారం ఒక్క రోజులోనే చాట్ జీపీటీ మొబైల్ యాప్ తొలగింపులు మూడు రెట్లు పెరిగాయి. పెంటగా న్ తో ఒప్పందం త్వరపడి కుదిరిందని సామ్ ఆల్ట్మన్ అంగీకరించారు. ఈ ఒప్పందాన్ని సవరించి, సామూహిక గూఢచర్యానికి లేదా రక్షణ శాఖ గూఢచర్య సంస్థల వినియోగా నికి అనుమతించబోమని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.