విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా బోణీ.. ఉరుగ్వేపై 4–0తో గెలుపు

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా బోణీ.. ఉరుగ్వేపై 4–0తో గెలుపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా బోణీ చేసింది. జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బి తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 4–0తో ఉరుగ్వేకు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది. సునేలిటా టోప్పో (29వ ని), ఇషికా (39వ ని), లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెమ్‌సియామి (49వ ని), రుతుజా దాదాసో పిసల్ (57వ ని) ఇండియాకు గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు. ఆరంభంలో ఇరుజట్లు బంతిపై పట్టు కోసం తీవ్రంగా పోరాడాయి. దీంతో అవకాశాలను సృష్టించుకోలేక తొలి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండానే ముగిసింది. 

సోమవారం జరిగే రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా.. స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది. ఈ టోర్నీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఎంపీ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి,  శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, క్రీడా శాఖ అధికారులు, హాకీ సంఘం ప్రతినిధులు, ప్లేయర్లు, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.