బైక్‌‌‌‌కు లాక్‌‌‌‌ వేసినా కొన్నిసార్లు దొంగతనాలు.. కానీ రూ.450తో కొని ఈ బ్రేక్‌‌‌‌ లాక్ వేశారంటే..

బైక్‌‌‌‌కు లాక్‌‌‌‌ వేసినా కొన్నిసార్లు దొంగతనాలు.. కానీ రూ.450తో కొని ఈ బ్రేక్‌‌‌‌ లాక్ వేశారంటే..

బైక్‌‌‌‌కు లాక్‌‌‌‌ వేసినా కొన్నిసార్లు దొంగతనాలు జరుగుతుంటాయి. అందుకే ఇలాంటి బ్రేక్‌‌‌‌ లాక్స్‌‌‌‌ని కూడా వేసుకోవాలి. దీన్ని హీర్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ అనే కంపెనీ తయారుచేసింది. దీంతో హ్యాండిల్ బార్‌‌‌‌ని బ్రేక్ లీవర్‌‌‌‌తో కలిపి లాక్ చేసుకోవచ్చు. దాంతో బ్రేక్ పట్టుకుని ఉంటుంది.

చక్రాలు తిరగవు. దీన్ని హెవీ డ్యూటీ స్టెయిన్‌‌‌‌లెస్ స్టీల్‌‌‌‌తో తయారుచేశారు. కాబట్టి పగలగొట్టడం అంత ఈజీ కాదు. తుప్పు పట్టదు, వర్షం, ధూళిని  కూడా తట్టుకుంటుంది. చాలాకాలం పాటు మన్నికగా ఉంటుంది. ఇది దాదాపు అన్ని రకాల బైక్‌‌‌‌లకు సరిపోతుంది. పైగా కాంపాక్ట్‌‌‌‌ సైజులో, తేలికగా ఉంటుంది.

►ALSO READ | 8 ఇన్‌‌‌‌ 1 అడాప్టర్‌.. ‌‌‌ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లకు ఇది ఎంత ఉపయోగం అంటే..