న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను పెంచనుంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వలన వివిధ రూట్లలో అంతరాయం ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 నుంచి 18 వరకు 78 అదనపు అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను నడపనుంది. ఈ సేవలు న్యూయార్క్, లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, ఆమ్స్‌టర్డామ్, జ్యూరిక్, పారిస్, కొలంబో, మాలే (మాల్దీవులు) వంటి తొమ్మిది రూట్లను కలుపుతాయి.
‘‘ఈ అదనపు విమాన సర్వీస్‌లు మొత్తం 17,660 సీట్లు అందిస్తాయి. యూరప్‌లోని ఐదు ప్రధాన గేట్‌వేలు, న్యూయార్క్‌తో పాటు శ్రీలంక, మాల్దీవులకు కూడా అదనపు సేవలు అందుబాటులో ఉంటాయి”అని ఎయిర్ ఇండియా పేర్కొంది. అధిక డిమాండ్‌ను తీర్చడానికి అదనంగా సర్వీస్‌లను అందిస్తున్నామని తెలిపింది.
