బాలికల ఆరోగ్య రక్షణకే హెచ్పీవీ టీకా 

బాలికల ఆరోగ్య రక్షణకే హెచ్పీవీ టీకా 

కాశీబుగ్గ(కార్పొరేషన్)/ నర్సంపేట/ భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం టౌన్/ అశ్వారావుపేట, వెలుగు​: బాలికల ఆరోగ్య రక్షణ కోసం హెచ్​పీవీ టీకా తీసుకోవాలని పలువురు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సూచించారు. ఆదివారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలుచోట్ల హెచ్​పీవీ వ్యాక్సిన్​అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వరంగల్​ బల్దియా మేయర్​ గుండు సుధారాణి, కలెక్టర్​ చాహత్​బాజ్​పాయ్​వ్యాక్సిన్​ అందజేసి, ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. వరంగల్​ జిల్లా నర్సంపేట ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రిలో డీఎంహెచ్​వో సాంబశివరావు టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

కొత్తగూడెంలోని జీజీహెచ్​లో కలెక్టర్​ అంకిత్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఖమ్మం జనరల్​ ఆస్పత్రిలో కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ టీకా అందజేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.