నీతి ఆయోగ్‘బెస్ట్ ప్రాక్టీసెస్’ కు పెంబి ఎంపిక : కలెక్టర్ అభిలాష అభినవ్

నీతి ఆయోగ్‘బెస్ట్ ప్రాక్టీసెస్’ కు పెంబి ఎంపిక : కలెక్టర్ అభిలాష అభినవ్
  • రాష్ట్రంలో నిర్మల్, గద్వాల జిల్లాలకు మాత్రమే చోటు
  • కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద నిర్వహించే 'బెస్ట్ ప్రాక్టీసెస్' సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిర్మల్​ జిల్లా పెంబి ఆస్పిరేషనల్ బ్లాక్ ఎంపికైనట్లు  కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఏపీలోని విశాఖపట్నంలో జరిగే ఉన్నత స్థాయి సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో పెంబి బ్లాక్ సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నా రు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక రంగాల్లో పెంబి మండలం గణనీయమైన పురోగతి సాధించినందుకు ఈ అవకాశం దక్కిందన్నారు.

తెలంగాణ నుంచి నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు మాత్రమే ఈ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపిక కావడం జిల్లాకు గౌరకారణమన్నారు. పెంబి బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ వేదికపై ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.