లవ్లో ఫెయిల్ అయిన అన్న.. చెల్లిని 40 సార్లు పొడిచి చంపేశాడు.. ఈ ఇద్దరూ కవల పిల్లలు !

లవ్లో ఫెయిల్ అయిన అన్న.. చెల్లిని 40 సార్లు పొడిచి చంపేశాడు.. ఈ ఇద్దరూ కవల పిల్లలు !

ప్రేమ త్యాగాన్ని కోరుతుందని అంటారు. కానీ.. ఈ ప్రేమికుడి ఉన్మాదం హత్యకు దారి తీసింది. లవ్లో బ్రేకప్ అయిన డిప్రెషన్లో ఉన్న యువకుడు.. తన ప్రేమ విఫలం కావడానికి తోడబుట్టిన సోదరి కారణమని భావించి అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. 40 సార్లు పొడిచి పొడిచి చంపాడు. పోస్ట్ మార్టంలో ఆమె శరీరంపై 40 కత్తిపోట్లు ఉన్నాయని తేలడం గమనార్హం.

ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. మరో దారుణమైన విషయం ఏంటంటే.. చంపిన ఈ ప్రేమోన్మాది, అతని సోదరి కవల పిల్లలు. గర్భంలోనే కన్న తల్లి కడుపు పంచుకుని పుట్టారనే విషయం కూడా మర్చిపోయి ఈ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. కన్న తల్లిపై కూడా దాడి చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్కు చెందిన హార్థిక్, హింశిక కవల పిల్లలు. ఈ ఇద్దరి వయసూ 25 సంవత్సరాలు. ఈ ఇద్దరి తల్లి నీలిమా. మొరదాబాద్లోని బుద్ధి విహార్ కాలనీలో నీలిమ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. నీలిమా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంది. హార్థిక్, హింశిక గురుగ్రాంలో పనిచేస్తున్నారు. హోలీ పండుగ కావడంతో మొరదాబాద్ వెళ్లారు. నీలిమా, హింశిక హోలీ పండుగ జరుపుకున్నారు. అయితే.. హార్థిక్ మాత్రం హోలీ సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఇంట్లో దిగాలుగా కూర్చుని బ్రేకప్ తల్చుకుని బాధపడ్డాడు.

►ALSO READ | ‘కేరళ స్టోరీ 2’ని ఎవరూ చూడట్లే.. సినిమాలను రాజకీయం కోసం వాడుకుంటున్నరు: రాహుల్

ఇన్ స్టా్గ్రాంలో పరిచయమైన పుణె యువతితో లవ్.. ఏడు నెలల క్రితం బ్రేకప్. అప్పటి నుంచి హార్థిక్ డిప్రెషన్తో బాధపడుతున్నాడు. చిన్నచిన్న విషయాలకే చిరాకు పడుతుండేవాడు. విపరీతమైన షార్ట్ టెంపర్ చూపించేవాడు. తన సోదరి, తల్లి వల్లే అమ్మాయి దూరమైందని ఇద్దరిపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే.. హోలీ హాలిడేస్ అయిపోయాక నీలిమ ఆఫీస్కు వెళ్లిపోయింది. హార్థిక్, హింశిక కూడా గురుగ్రాం వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంట్లో వీళ్లిద్దరే ఉన్నారు. ఈ క్రమంలో మాటల సందర్భంలో హార్థిక్ బ్రేకప్ ప్రస్తావనకొచ్చింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలి వానగా మారింది. 

కత్తితో తన సోదరిపై హార్థిక్ దాడి చేశాడు. అయినా అతని కసి తీరకపోవడంతో ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ తెలీనట్టుగా కన్న తల్లి పనిచేస్తున్న ఆఫీస్ కు వెళ్లి అర్జెంట్ పని ఉందని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో చూస్తే హింశిక రక్తపు మడుగులో పడి ఉంది. ఒక్కసారిగా కన్న తల్లికి గుండె ఆగినంత పనయింది. భయంతో, బాధతో ఏడుస్తూ కేకలేసింది. ఇరుగుపొరుగు వాళ్లు వచ్చారు. ఈ లోపే కన్న తల్లిపై కూడా హార్థిక్ దాడి చేసి అక్కడి నుంచి కారులో పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.