బర్మింగ్‌హామ్: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ 12వ ర్యాంకర్ లక్ష్య 15–21, 22–20 తో లిన్ చున్ యి (చైనీస్‌తైపీ) చేతిలో ఓడాడు. దాంతో టైటిల్ కోసం 25 ఏళ్ల నిరీక్షణకు ఇంకా తెరపడలేదు. 57 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తేలిపోయినా రెండో గేమ్‌లో కాస్త పుంజుకున్న లక్ష్యసేన్ 4–4తో స్కోరు సమం చేసి రేసులోకి వచ్చాడు.
ఇక్కడి నుంచి ఇద్దరు ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లారు. 16–16 స్కోరు వద్ద రెండు స్మాష్‌లు కొట్టిన లక్ష్య 18–16తో లీడ్‌లోకి వచ్చాడు. కానీ లిన్ చున్ బలమైన స్మాష్‌లతో మూడు పాయింట్లు నెగ్గి 19–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరకు 20–20 స్కోరు వద్ద రెండు కీలక పాయింట్లు రాబట్టిన లిన్ చున్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
