T20 World Cup: కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. భారత జట్టులో ఏకంగా నాలుగు మార్పులు..?

T20 World Cup: కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. భారత జట్టులో ఏకంగా నాలుగు మార్పులు..?

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌ మ్యాచ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ భారీ పోరుకు ముందు ఇండియన్ టీమ్ ప్లేయింగ్ ఎలెవన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు తుది జట్టులో నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. దీంతో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరు ప్లేయర్స్ ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లోనే ఉంటారని టాక్. ఈ టోర్నమెంట్‌లో వీరి ప్రదర్శన ఆశించినంతగా లేదు.. కానీ అభిషేక్ శర్మ మొత్తం టోర్నమెంట్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేయగా, వరుణ్ చక్రవర్తి కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. సెమీఫైనల్ లో అతను నాలుగు ఓవర్లలో ఏకంగా 64 పరుగులు ఇచ్చి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.

ప్లేయింగ్ ఎలెవన్ నుంచి వెళ్లే ప్లేయర్స్: 
భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు ఏం కనిపించడం లేదు.. కేవలం కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్ ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. ఫైనల్ వరకు టీమ్ ని తీసుకొచ్చిన అదే 11 మంది ఆటగాళ్లపై జట్టు మేనేజ్‌మెంట్ విశ్వాసం పెట్టుకుంది. మరోవైపు, అహ్మదాబాద్ పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని న్యూజిలాండ్ జట్టు కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జిమ్మీ నిషమ్ లేదా జేకబ్ డఫీలో ఎవరో ఒకరు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

ఫైనల్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌: 
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ( వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ( కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్‌: 
టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారెల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్‌కోంకీ, జిమ్మీ నిషమ్ / జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, లోకి ఫర్గుసన్.