T20 World Cup Final: కాసేపట్లో ఇండియా– న్యూజిలాండ్ ఫైనల్ ఫైట్.. విజేత ఎవరో చెప్పేసిన జ్యోతిష్యులు

T20 World Cup Final: కాసేపట్లో ఇండియా– న్యూజిలాండ్ ఫైనల్ ఫైట్.. విజేత ఎవరో చెప్పేసిన జ్యోతిష్యులు

T20 World Cup Final: టీ20 ప్రపంచ్ కప్ టోర్నమెంట్ చివరి అంకానికి చేరుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వేచి చూస్తోన్న ఫైనల్ మ్యాచ్ మరి కొన్ని గంటలలో ప్రారంభం కానుంది. కోట్లాది మంది క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. మరోసారి భారత జట్టు కప్ కొట్టాలని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నాడు. కాసేపట్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ మైదానంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ పోటీపడనున్నాయి. ఇప్పటి వరకు నాకౌట్స్ మ్యాచులలో కివీస్ పై భారత్ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది.  

అయితే ఈ ఫైనల్  మ్యాచ్ లో ఎలా అయినా సరే ఇండియన్ టీమ్ గెలవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరికొందరు ఇవాళ్టి మ్యాచ్ గురించి జోతిష్యం చెప్పిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం జరిగే ఫైనల్ మ్యాచ్ గురించి పలువురు జ్యోతిష్య నిపుణులు.. నేటి గ్రహాల సంచారాలు, ఈ మ్యాచ్‌లో ఏ ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారో చెబుతున్నారు. సమ ఉజ్జీల మధ్య పోటీ ఒక్కసారిగా ఎలా ఏకపక్షంగా మారనుందో అంచనా వేస్తున్నారు. 

చంద్రుడు: మ్యాచ్‌లో భావోద్వేగ సమయాన్ని ప్రభావితం చేసే గ్రహం చంద్రుడు.. ఈరోజు జరిగే మ్యాచ్ లో చంద్రుడు.. ప్లేయర్స్ రియాక్షన్, ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడని జ్యోతిష్యశాస్త్ర పండితులు అంచనా వేస్తున్నారు. 

అంగారకుడు: దూకుడుగా, శారీరక శక్తి, పోటీ తత్వానికి ప్రతీక అంగారకుడు నిలుస్తున్నాడు. ఈ గ్రహం బలంగా ఉన్నప్పుడు బ్యాటింగ్ లో దూకుడు, వేగవంతమైన బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. 

బుధుడు: సమన్వయం, వ్యూహాత్మక ఆలోచనలను నియంత్రించే గ్రహం ఇది. బుధుడు బలంగా ఉంటే బ్యాటింగ్ మరింత చురుకుగా, ఫీల్డింగ్ ఖచ్చితంగా ఉండనుందని పేర్కొంటున్నారు. 

బృహస్పతి: అదృష్టం, అవకాశాలు, కీలక మలుపులపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు. మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చే క్షణాలను గురు గ్రహం ప్రభావితం చేస్తుంది.  

శని : క్రమశిక్షణతో పాటు వ్యూహంతో ఆడాలని ఈ గ్రహం సూచిస్తుంది. శని ప్రభావం ఉన్నప్పుడు రెండు జట్లు జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. 

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికంటే: 
ఆటలో ప్రదర్శన సాధారణంగా మంగళ–గురు మధ్య సయోధ్య బలంగా ఉన్నప్పుడు అద్భుత ఫలితాలు వస్తాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. టీమిండియా తరఫున హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శన చేసే ఛాన్స్ ఉండగా.. న్యూజిలాండ్ తరఫున ఓపెనింగ్ భాగస్వామ్యం లేకపోతే మిచెల్ సాంట్నర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

విజేతగా నిలిచేది ఏ జట్టు: 
గ్రహాల సంచారాలు, ప్లేయర్స్ జాతకాల ఆధారంగా చూస్తే, ఈరోజు గ్రహాల కదలికలన్ని కూడా టీమిండియా దూకుడుకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ సమయంలో కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు సూర్యుడితో త్రికోణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది ఇండియన్ టీమ్ కి స్థిరత్వాన్ని అందజేస్తుంది. అలాగే వీరు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఆటపై వీరి దృష్టి కేంద్రీకరిస్తారు. ముఖ్యంగా ఛేజింగ్ సమయంలో చాలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు.  

ఇక న్యూజిలాండ్ జట్టుపై శని ప్రభావం ఉండటం వలన క్రమశిక్షణతో ఆడి చివరి వరకు పోటీలో నిలబడేలా చేస్తుంది. కానీ శని ప్రభావంతో కివీస్ టీమ్ చాలా ఇబ్బందికర పరిస్థితులను చూడాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు గ్రహాల అనుకూలం వలన, ప్రతి ప్లేయర్, ఆటతీరు చాలా అద్భుతంగా ఉండనుంది.