దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ దాడిని ధృవీకరించింది. 3 వేల 897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్‌లో బహిర్గతమైందని తెలిపింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడికి కారణాలు, అలాగే కస్టమర్లకు, బ్యాంకుకు ఈ సైబర్ దాడి వలన జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఒక సమగ్ర దర్యాప్తు అవసరమని SIB పేర్కొంది. బ్యాంకు కొంత డేటాను కోల్పోయిన ఒక ఘటనను తెలియజేస్తున్నామని SBI బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
#JustIN | #SBI Says: Bank Received CERT-In Communication w.r.t Suspected Exposure Of Customer Data On #DarkWeb 🔴Prelim Analysis Identified 3.75 Lk Records Available On The Dark Web. 3,897 Customer Records Containing Personally Identifiable Information (#PII) Were Identified 🔴Bank Promptly Activated Its #CyberIncident Response And Containment Protocols 🔴Independent CERT-IN-Empanelled Cybersecurity Agency Engaged To Conduct Comprehensive Assessment 🔴Alleged #DataLeak Does Not Have Any Material Impact On Bank’s Core Biz Ops
— CNBC-TV18 (@CNBCTV18Live) October 21, 2026
SBI తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 16, 2026న, డార్క్ వెబ్‌లో బ్యాంకు కస్టమర్ డేటా బహిర్గతమైందనే అనుమానంపై ఒక హెచ్చరికకు సంబంధించి, దాని థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్ అయిన డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, CERT-In నుంచి బ్యాంకుకు సమాచారం అందింది. డార్క్ వెబ్లో కనిపించిన కస్టమర్ల సమాచారంలో కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, పేర్లు, లింగం, ఈ-మెయిల్ చిరునామాలు, ఇంటి చిరునామాలు, బ్రాంచ్, CIF ఐడెంటిఫైయర్‌లు, లీడ్ ఐడీలు, ఇంకా లోన్/లీడ్ రికార్డులు, ఇతర సంబంధిత ఫైళ్లకు సంబంధించిన మెటాడేటా ఉన్నట్లు SBI తెలిపింది.
ALSO READ : ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్..
SBI బ్యాంకు ఈ సైబర్ దాడిపై సమగ్ర దర్యాప్తునకు బ్యాంకు CERT-In-ప్యానెల్‌లో ఉన్న ఒక స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించింది. ఈ సైబర్ దాడి వలన బ్యాంకు ప్రధాన వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని కస్టమర్లకు SBI తెలిపింది. బ్యాంకు ప్రధాన కార్యకలాపాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది.
