ఓడియమ్మ.. అథ్లెట్లే కాదు.. ట్రాక్‌పై కెమెరామ్యాన్ స్టంట్స్ మామూలుగా లేవు.. వీడియో వైరల్!

ఓడియమ్మ.. అథ్లెట్లే కాదు.. ట్రాక్‌పై కెమెరామ్యాన్ స్టంట్స్ మామూలుగా లేవు.. వీడియో వైరల్!

CWG 2026: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కమన్‌వెల్త్ గేమ్స్ మైదానంలో క్రీడాకారుల అద్భుత ప్రదర్శనలతో పాటు ఒక వినూత్న దృశ్యం వీక్షకులను బాగా ఆకట్టుకుంది. అథ్లెటిక్స్ ఈవెంట్ సమయంలో, ట్రాక్ అండ్ ఫీల్డ్ రన్నర్లతో సమాన వేగంతో ఒక కెమెరామెన్ ఎలక్ట్రిక్ సైకిల్ (సింగిల్ వీల్ ఈ-సైకిల్) పై ప్రయాణిస్తూ షూటింగ్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TNT Sports (@tntsports)

సింగిల్ వీల్‌పై పర్‌ఫెక్ట్ బ్యాలెన్స్: 
అథ్లెట్లు అత్యంత వేగంగా ట్రాక్‌పై పరిగెడుతున్న సమయంలో, ఈ కెమెరామెన్ ఒకే చక్రం ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్ పై ఎంతో సునాయాసంగా గ్లైడ్ అవుతూ, అద్భుతమైన బ్యాలెన్స్‌తో వారి క్లోజప్ విజువల్స్ ను కెమెరాలో బంధించాడు. పరుగు పందెంలో పాల్గొంటున్న అథ్లెట్లకు ఎలాంటి ఆటంకం కలగకుండానే, వారికి అత్యంత సమీపం నుంచి అన్ని యాంగిల్స్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించారు. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వీక్షించిన జనాలు ఈ దృశ్యాలకు ఫిదా అయ్యారు. అతడి బ్యాలెన్సింగ్ స్కిల్స్, కోఆర్డినేషన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

ALSO READ : ఫుట్‌బాల్‌లో బిగ్ వార్ : FIFA vs UEFA మధ్య అసలు గొడవ ఏంటి?

స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో వినూత్న ప్రయోగం: 
ఆధునిక క్రీడా ప్రసారాలలో కొత్త టెక్నాలజీ, వినూత్న పద్ధతుల వినియోగానికి ఈ ఘటన ఒక సరికొత్త నిదర్శనంగా నిలిచింది. సాధారణంగా మారథాన్‌లు, రోడ్ రేసులలో ఎలక్ట్రిక్ యునిసైకిళ్లను కెమెరామెన్లు అప్పుడప్పుడు వాడుతుంటారు. అయితే, కమన్‌వెల్త్ గేమ్స్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఇలాంటి షూటింగ్ టెక్నిక్ ఉపయోగించడం ఒక సర్‌ప్రైజింగ్ అనుభూతిని ఇచ్చింది. క్రీడాకారుల మెరుపు వేగానికి తోడుగా కెమెరామెన్ చేసిన ఈ సాహసవంతమైన ఫీట్, గ్లాస్గో 2026 గేమ్స్‌లో ఒక గుర్తుండిపోయే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.