పవన్‌లో నిలకడ లేదంటూ జనసేనకు మాజీ జేడీ రాజీనామా

పవన్‌లో నిలకడ లేదంటూ జనసేనకు మాజీ జేడీ రాజీనామా

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడైన పవన్‌ కల్యాణ్‌ విధి విధానాలు నచ్చకనే రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. “పూర్తి జీవితం రాజకీయాలకే అని చెప్పిన పవన్.. తిరిగి సినిమాల్లో నటిస్తుండడం చూస్తుంటే .. ఆయనలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. అందుకే జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని అనుకుంటున్నాను  ” అని లేఖలో తెలిపారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు.

లేఖలో..తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా జనసేన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

Related News: ‘నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే’