MEGA157: శరవేగంగా చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ.. సెకండ్ షెడ్యూల్‌ కంప్లీట్

MEGA157: శరవేగంగా చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ.. సెకండ్ షెడ్యూల్‌ కంప్లీట్

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌‌గా మొదలైన ఈ మూవీ షూటింగ్‌‌ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్గా సెకండ్ షెడ్యూల్‌‌ పూర్తయినట్టు మేకర్స్ తెలియజేశారు. ముస్సోరీలో జరిగిన ఈ షెడ్యూల్‌‌లో  చిరంజీవి, నయనతార మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ సీన్స్ సినిమాలో హైలైట్‌‌గా ఉంటాయని చెప్పారు. చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్‌‌లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్‌‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ  చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’చిత్రం కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.