ఆ టైటిల్ వద్దంటున్న చిరు.. ఎందుకో తెలుసా?

ఆ టైటిల్ వద్దంటున్న చిరు.. ఎందుకో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ విశిష్ట(Vassishta)తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం షెరవేగంగా జరుగురుగుతోంది. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఈ ప్రాజెక్టు కు సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ముందు నుండి ముల్లోక వీరుడు అనే టైటిల్ అనుకుంటున్నారట మేకర్స్. ఇదే విషయాన్ని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లగా.. క్లియర్ గా నో చెప్పేశారట. ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ వద్దు అని సూచించారట. దానికి కారణం ఆయన నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ సినిమాకు రిలేటెడ్ గా టైటిల్ ఉండకూడదని చెప్పేశాడట చిరు. అంతేకాదు జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్ర నిర్మాత అశ్వినిదత్ ఈ సినిమా విషయంలో లీగర్ నోటీసులు ఇవ్వడం కూడా మరో కారణంగా చెప్తున్నారు. దీంతో మరో టైటిల్ ను సెట్ చేసే పనిలో పడ్డారట మేకర్స్.