Vyooham Trailer: RGV ట్విస్ట్.. వ్యూహం సినిమాలో.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం

Vyooham Trailer: RGV ట్విస్ట్.. వ్యూహం సినిమాలో.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం

దివగంత నేత వై ఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekhara reddy) మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం వ్యూహం(Vyooham). సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం వ్యూహం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు(అక్టోబర్ 13) వ్యూహం ట్రైలర్(Vyooham Trailer) ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా ఆసక్తిగా వుంది. వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ సీఎం అవ్వాలనుకున్నారు కానీ.. కాంగ్రెస్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో జగన్ కొత్త పార్టీ స్థాపించి.. అక్కడి నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెడతారు. అలా అనూహ్యమైన పరిస్థితుల మధ్య మొదలైన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)ని ఎలా ఎదుర్కున్నాడు? పార్టీని ఏవిధంగా బలోపేతం చేసుకున్నాడు? 2019లో ఎలా అధికారంలోకి వచ్చాడు? అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్(Pawan kalyan) పాత్ర ఏమిటి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు దర్శకుడు ఆర్జీవీ. 

ALSO READ:  రవితేజ సినిమాకు అన్యాయం.. లియోకు అంత అవసరమా?

ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.. సోనియా గాంధీ జగన్ కు పాదయాత్ర ఆపేయమని చెప్పడం, చంద్రబాబును 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయుండి 40 ఏళ్ళ కుర్రానికి భయపడటం ఏంటి? అనే డైలాగ్, జగన్ సీఎం కాకూడదు అని పవన్ కళ్యాణ్ అనడం, ఇక చివర్లో చంద్రబాబు అరెస్ట్ అయినా స్కిల్ డెవలప్మెంట్ గురించి ప్రస్తావించడం వంటివి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. చూస్తుంటే ఈ సినిమా విమర్శలకు, వివాదాలకు దారి తీసేలా కనిపిస్తోంది. చూడాలి రిలీజ్ తరువాత ఆ ప్రభావం ఎలా ఉంటుందో.