మార్చి నుంచి మళ్లీ ఫైర్ సేఫ్టీ తనిఖీలు

మార్చి నుంచి మళ్లీ ఫైర్ సేఫ్టీ తనిఖీలు
  • రూల్స్​ పాటించకపోతే సీజ్ చేసుడే 
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు: వ్యాపార సంఘాల వినతితో ఫైర్​సేఫ్టీ రూల్స్​పాటించేందుకు నెల సమయం ఇచ్చామని, మార్చి రెండో వారం నుంచి మళ్లీ తనిఖీలు ముమ్మరం చేస్తామని హైడ్రా చీఫ్​రంగనాథ్​తెలిపారు. నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాతబస్తీలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే జుల్ఫీకర్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. సిటీలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణం రూల్స్​ఉల్లంఘించడమే కారణమని, అందుకే ఈ అంశంపై తాము దృష్టి పెట్టామన్నారు.

రూల్స్​పాటించని వారు ఉంటే సమాచారం ఇవ్వాలని వ్యాపార సంఘాలు, ప్రజలను రంగనాథ్​కోరారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఆర్ఎఫ్వో జయప్రకాష్, డీఎఫ్​వోలు యజ్ఞ నారాయణ, వెంకన్న, విద్యుత్ అధికారి ఏవీ రామారావు, సిటీ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.