ఉద్యమకారులను కవిత మభ్యపెడుతున్నది : డా.పిడమర్తి రవి

ఉద్యమకారులను కవిత మభ్యపెడుతున్నది :  డా.పిడమర్తి రవి
  • ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి

బషీర్​బాగ్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ఉద్యమకారుల ఊసే ఎత్తని కల్వకుంట్ల కవిత.. ఇయ్యాల అధికారంలో నుంచి దిగిపోగానే ఉద్యమకారులను నెత్తిన ఎత్తుకుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. పిడమర్తి రవి విమర్శించారు. ఉద్యమకారులను మభ్యపెట్టడానికి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పేరిట కొత్త నాటకానికి తెర తీశారన్నారు.

గురువారం గన్ పార్కు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, ఉద్యమకారులతో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. ఉద్యమకారులపై కవితకు నిజంగా ప్రేమ ఉంటే తాను అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఉద్యమకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలన్నారు.