హాలిడే ట్రిప్ లో చిరు.. వచ్చాక కామెడీ టచ్‌తో మూవీ షురూ

హాలిడే ట్రిప్ లో చిరు.. వచ్చాక కామెడీ టచ్‌తో మూవీ షురూ

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)  యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరు రీసెంట్ గానే భోళా శంకర్ మూవీ షూట్ పూర్తీ చేసుకున్నారు. మరో కొత్త ప్రాజెక్టులో జాయిన్ అయ్యే ముందు చిరు తన భార్యతో కలిసి యుఎస్‌కి వెకేషన్ ట్రిప్‌కు బయలుదేరారు. 

ALSO READ :'లవ్ టుడే' హీరో ప్రదీప్ రంగనాధన్ తో..బాలీవుడ్ బ్యూటీ జాన్వీ?

తాజాగా సోషల్ మీడియాలో వారి ఫొటోలను షేర్ చేసి నోట్‌తో పంచుకున్నారు. ''GoldBoxEnt నిర్మిస్తున్న నాతదుపరి చిత్రం షూట్‌లో చేరడానికి ముందు రిఫ్రెష్ అవ్వడానికి.. చైతన్యం నింపుకొనుటకు సురేఖతో కలిసి ఒక చిన్న హాలీడే ట్రిప్ యుఎస్‌కి బయలుదేరాను!” అని ట్వీట్ చేశారు చిరు. 

చిరంజీవి హీరోగా బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna)  డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసేందే. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినా ఈ మూవీకు  ‘ధమాకా’ రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్(Bezawada Prasanna Kumar)  స్టోరీని అందిస్తుండగా.. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela), ఆమె భర్త విష్ణు ప్రసాద్(Vishnu Prasad) సంయుక్తంగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ (Gold box entertainments)  బ్యానర్ పై ఈ మూవీను నిర్మిస్తున్నారు.  త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని  వివరాలు మేకర్స్ ప్రకటించునున్నారు.