
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Jahnvi Kapoor) ఎన్టీఆర్(jr ntr) దేవర మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ అవుతున్నవిషయం తెలిసేందే. తాజాగా తమిళంలో కూడా ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది. హీరోయిన్ నయన్(Nayan) భర్త విఘ్నేష్ శివన్(Vignesh Shivan) డైరెక్షన్ లో నటిస్తుందని సమాచారం.
లవ్ టుడే మూవీతో యూత్ ను బాగా ఆకట్టుకున్న యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్. ఇప్పటికే డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. హీరో రంగనాధన్ ,బ్యూటీ జాన్వీ తో కథ చర్చలు పూర్తి చేసినట్లు సమాచారం..కాగా ఈ మూవీకు కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ మూవీకు లోకనాయకుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఏ మూవీను నిర్మిస్తున్నారు. ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సన్ న్యూస్ తెలిపింది.
Also Read :కేసీఆర్ కు లేఖ రాసిన తుమ్మేటి సమ్మిరెడ్డికి షోకాజ్ నోటీసు
రీసెంట్ గా జాన్వీ సౌత్ ఇండియన్ సినిమాలో నటించడం తన కల నిజమవుతుందని వెల్లడించింది. లవ్ టుడే మూవీ తో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చిన..ప్రదీప్ రంగనాధన్ తో జాన్వీ యాక్ట్ చేస్తుందని తెలిసాక ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.