ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు గురి

ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌‌‌‌‌  వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు గురి

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ తొమర్‌‌‌‌‌‌‌‌.. ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌‌‌‌‌‌‌ త్రీ పొజిషన్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌‌‌‌‌ 362 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. దాంతో ఈ కేటగిరీలో అత్యధిక పాయింట్లు సాధించిన షూటర్‌‌‌‌‌‌‌‌గా వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. 

ఇండియాకే చెందిన నీరజ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ (361.8), అఖిల్‌‌‌‌‌‌‌‌ షెరోన్‌‌‌‌‌‌‌‌ (343.5) వరుసగా సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ను సాధించి క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌ చేశారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైట్‌‌‌‌‌‌‌‌లో చివరి షాట్‌‌‌‌‌‌‌‌లో ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌‌‌‌‌ 10.7 పాయింట్లు సాధించడంతో స్వర్ణం ఖాయమైంది. అప్పటి వరకు గట్టి పోటీ ఇచ్చిన నీరజ్‌‌‌‌‌‌‌‌ 0.2 తేడాతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు పరిమితమయ్యాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో నీరజ్‌‌‌‌‌‌‌‌ 593, ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌‌‌‌‌ 588, అఖిల్‌‌‌‌‌‌‌‌ 588 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌–3లో నిలిచారు. టీమ్‌‌‌‌‌‌‌‌ విభాగంలోనూ నీరజ్‌‌‌‌‌‌‌‌, ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌‌‌‌‌, అఖిల్‌‌‌‌‌‌‌‌ త్రయం 1769 పాయింట్లతో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. జపాన్‌‌‌‌‌‌‌‌ (1754), కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌ (1748) వరుసగా రజతం, కాంస్యం దక్కించుకున్నాయి. జూనియర్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అడ్రియన్‌‌‌‌‌‌‌‌ కర్మాకర్‌‌‌‌‌‌‌‌ 353.2 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించాడు. మన్వీందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ షెకావత్‌‌‌‌‌‌‌‌ (338.6)కు కాంస్యం లభించింది.