రాయలసీమ బ్యాక్‌‌డ్రాప్‌‌లో.. వెంకటేష్ అనిల్ రావిపూడి మూవీ...

రాయలసీమ బ్యాక్‌‌డ్రాప్‌‌లో.. వెంకటేష్ అనిల్ రావిపూడి మూవీ...

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌‌లో అనిల్ రావిపూడి డైరెక్షన్‌‌లో  ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మల్టీస్టారర్‌‌‌‌ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, సోమవారం నుంచి హైదరాబాద్‌‌లో  రెగ్యులర్ షూటింగ్‌‌ను స్టార్ట్ చేశారు. రాయలసీమ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు స్పెషల్ వీడియోతో రివీల్ చేసింది టీమ్. 

కీర్తి సురేష్​, కృతిశెట్టి హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని  సురేష్​ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్​ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్‌‌కు సన్నాహాలు చేస్తున్నారు.