చియాన్ విక్రమ్ తంగలాన్‌ మూవీ నుంచి బిగ్ అప్డేట్

 చియాన్ విక్రమ్ తంగలాన్‌ మూవీ నుంచి బిగ్ అప్డేట్

వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో కమల్ హాసన్ తర్వాత చియాన్ విక్రమ్(Chiyyan,Vikram) పేరు గుర్తుకు వస్తుంది. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన ఎంచుకునే సినిమాలతో పాటు.. అందుకు తగ్గట్లు తన లుక్స్‭ను మార్చుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విక్రమ్ రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో తన లుక్ కోసమే ఎక్కువ కసరత్తు చేస్తుంటాడు. తన పాత్రకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్‌ అయినా చేస్తాడు.

ప్రస్తుతం విక్రమ్ పా. రంజిత్‌ దర్శకత్వంలో తంగలాన్‌(Thangalaan) అనే సినిమా చేస్తున్నారు. పీరియాడికల్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. విక్రమ్ కు ఇది 61వ మూవీ. స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ (MalavikaMohanan)గా కనిపించనుంది. 

లేటెస్ట్ గా తంగలాన్ మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా వచ్చే ఏడాది 2024 జనవరి 26 న రిలీజ్ కాబోతుందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమా నుంచి నవంబర్ 1 న టీజర్ రిలీజ్ కూడా రాబోతుందంటూ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో చియాన్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అని చెప్పుకోవాలి. ఈ మూవీలో విక్రమ్ తన పాత్ర కోరకు ఎంత కష్ట పడుతుండనేది..అతని మేకోవర్ చూస్తుంటే తెలుస్తోంది. 

ALSO READ :టిల్లు వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

ఈ సినిమాలో పార్వతి ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. మరో  కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్ నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.  తమిళంతోపాటు  తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.