
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆదివారం (జూన్ 1న) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాజేంద్రప్రసాద్ కమెడియన్ అలీపై అసభ్య వ్యాఖ్య చేశారు. “ఏరా అలీగా.. ఎక్కడ ఆ ల******కు.. ఇటురా బే”అని నోరు అదుపు తప్పి మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాజేంద్రప్రసాద్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రాజేంద్రప్రసాద్ తన మాటలపై వివరణ ఇచ్చినప్పటికీ.. నెటిజన్లతో పాటుగా అలీ ఫ్యాన్స్ కూల్ అవ్వట్లేదు. ఈ క్రమంలో అందరినీ శాంతిపజేయడానికి అలీ ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. 'వీడియో వైరల్ చేయకండి' అంటూ రిక్వెస్ట్ చేశారు.
ALSO READ : అలీపై బూతులతో నోరు పారేసుకున్న రాజేంద్రప్రసాద్
అలీ మాటల్లోనే.. ‘‘అందరికీ నమస్కారం.. దర్శకుడు SV కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుక సందర్భంగా.. ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ నుంచి అనుకోకుండా మాట తూలింది. ఈ విషయంపై మీడియా మిత్రులు కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి నటుడు.. ఇటీవలే కూతురిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. కావాలని రాజేంద్రప్రసాద్ గారు అలా మాట్లాడింది కాదు. దయచేసి దీన్ని మళ్ళీ ఎవ్వరూ కూడా వైరల్ చేయకూడదని’’ రిక్వెస్ట్ చేస్తూ అలీ వీడియో రిలీజ్ చేశారు.
#RajendraPrasad గారికి అనుకోకుండా మాట తూలింది..
— Ramesh Pammy (@rameshpammy) June 2, 2025
దయచేసి వైరల్ చేయకండి - #ALi pic.twitter.com/6DrSeL4mIH