రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ వశం: బంపర్ మెజార్టీతో క్లీన్ స్వీప్

రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ వశం: బంపర్ మెజార్టీతో క్లీన్ స్వీప్

రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపింది. క్లియర్ కట్ మెజార్టీతో కార్పొరేషన్ను హస్తగతం చేసుకున్నది. మొత్తం 60 డివిజన్లు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ 38 డివిజన్లలో విజయం సాధించింది. భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయంతో.. రామగుండంలో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు.

60 డివిజన్లలో కాంగ్రెస్ 38 స్థానాల్లో గెలుపొందగా.. BRS.. భారత రాష్ట్ర సమితి కేవలం 13 సీట్లకే పరిమితం అయ్యింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. చాలా డివిజన్లలో భారీ తేడా ఓట్లతో ఓడిపోయారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు.

ALSO READ : మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి రాని మెజార్టీ

* బీజేపీ పార్టీ కేవలం ఒకే ఒక్క డివిజన్ లో గెలిచింది. 
* ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక డివిజన్ లో గెలుపొందాడు
* ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్.. AIFB పార్టీ అభ్యర్థులు.. 5 డివిజన్లలో విజయం సాధించారు.
* రామగుండం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకున్నది. భారీ విజయం తర్వాత రామగుండంలో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు