కౌన్సెలింగ్ : పిల్లల ఆన్లైన్ స్నేహాలతో తల్లిదండ్రులు జాగ్రత్త.. ఇవి పాటించండి..!

కౌన్సెలింగ్ : పిల్లల ఆన్లైన్ స్నేహాలతో తల్లిదండ్రులు జాగ్రత్త.. ఇవి పాటించండి..!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్రెండ్ షిప్ కు అర్థాలే మారిపోయాయి. ఒకే ఊరిలో, ఒకే వీధిలో, ఒకే క్లాస్ లో, ఒకే ఆఫీస్ లో ఉన్న వాళ్లతో కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడని కొందరు.. ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్ కు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, టిండర్ యాప్.. ఇలా ఎన్నో యాప్స్ ద్వారా పరిచయమైన వాళ్లతో చాలా క్లోజ్ అయిపోతుంటారు. ముఖ్యంగా ఇప్పటి యూత్ అలా తయారైంది. 

ఆన్ లైన్ ఫ్రెండ్.. వాళ్ల ముక్కూ మొఖం తెలియకున్నా.. ఫ్రెండ్స్ అయిపోతారు.. అది కొన్ని సార్లు ప్రేమకు దారి తీస్తుంది.. అది ఎన్ని అనర్ధాలకు మూలం అవుతుందో చెప్పడానికి ఎన్నో ఘటనలు కళ్లముందు ఉన్నాయి. అందుకే పేరెంట్స్.. మీ పిల్లలు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టండి. కనీసం ఈ ఆర్టికల్ చిదివిన తర్వాత అయినా మీ పిల్లలపై కేర్ తీసుకోండి. లేదంటే ఈ ఆన్ లైన్ స్నేహాల పేరిట జరుగుతున్న క్రైమ్ లో మనం కూడా విక్టిమ్స్ కావచ్చు.

ఆన్లైన్ స్నేహాల పేరుతో మహిళలు, యువతుల మీద జరిగే దాడి, బెదిరింపులు అన్నీ ఇన్నీ కావు. ఈ మధ్యే బెంగళూరులో టిండర్ అనే డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ అమ్మాయిని ఒక రాత్రి తనతో గడపమని కోరిన ఓ ప్రబుద్ధుడు జైల్లో కటకటాలు లెక్కపెట్టాడు. ఇదొక్కటే కాదు.. అసలు పరిచయం లేని వారితో సోషల్ మీడియా ద్వారా, డేటింగ్ యాప్ ద్వారా చాటింగ్ చేసి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. 

►ALSO READ | పసి ప్రాయాన్ని చిదిమేస్తున్న ఉన్మాదులు.. పెద్దలూ.. మీ పిల్లలు భద్రమేనా

కొన్నిసార్లు ఆ పరిచయాలు శారీరక సంబంధానికి కూడా దారి తీస్తున్నాయి. ఆ తర్వాత మోసగాళ్లు నగ్నచిత్రాలు బయటపెడతా అని, నగ్న వీడియోలు యూట్యూబ్ లో పెడతా అని బెదిరిస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఆన్ లైన్ స్నేహాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.

  • ఆన్లైన్ అపరిచితులతో స్నేహం చేయకండి. ఒకవేళ ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే.. అస్సలు యాక్సెప్ట్ చేయకండి.
  • ఒకవేళ చేసినా.. చాటింగ్, వీడియో కాలింగ్ంటి. వాటి జోలికి అస్సలు వెళ్లకండి.
  • ఆన్లైన్ యాప్స్, సోషల్ మీడియాలో పరిచయమైన వారిని నేరుగా కలవడానికి వెళ్లకండి.
  • ఒకవేళ కలిసినా... జనాలు తిరిగే చోట, సీసీ కెమెరాలు ఉన్న చోట మాత్రమే కలవండి. అప్పుడే వారు మీ మీద దాడి చేయడానికి సాహసించరు.
  • సైబర్ నేరగాళ్లు చనువుగా మాట్లాడుతూ.. వ్యక్తిగత వివరాలు సేకరిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అపరిచితులకు మన వ్యక్తిగత వివరాలు, నివాస వివరాలు ఇవ్వకూడదు.
  • స్నేహితులతో సోషల్ మీడియా యాప్స్ పంచుకున్నప్పటికీ హద్దుల్లో ఉండటమే బెటర్.
  • పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో అస్సలు పెట్టెద్దు. ఒకవేళ మార్పింగ్ గురైతే బాధపడాల్సి వస్తుంది.