ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా సైబర్ మోసాలు

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా సైబర్ మోసాలు
  •     ఫేక్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌ సైట్స్, కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్ నంబర్లతో 
  •     ఫ్రాడ్  చేసేందుకు సైబర్ నేరగాళ్ల స్కెచ్


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  కరోనా టైమ్​ను  క్యాష్ చేసుకునేందుకు సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు  స్కెచ్​ వేస్తున్నారు. ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌ వేరియంట్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో జనం ఎక్కువగా ఇంటర్నెట్​ను బ్రౌజ్​ చేసే అవకాశం ఉండటంతో.. సైబర్​ నేరగాళ్లు దీన్నే టార్గెట్ చేస్తున్నారు. గూగుల్​లో సెర్చ్​ యాక్టివిటీ ప్రకారం స్పామ్​ లింక్స్​ పంపి సైబర్​ ఫ్రాడ్స్​ చేస్తారని  పోలీసులు చెప్తున్నారు.  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ అడ్డాగా ఫేక్ ఈ– కామర్స్‌‌‌‌‌‌‌‌ సైట్స్‌‌‌‌‌‌‌‌, కస్టమర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌కేర్ నంబర్స్, వెబ్ పోర్టల్స్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు గుర్తించారు. ఇంటర్నెట్​ మోసాలపై జనాలకు అవేర్ నెస్ కల్పిస్తున్నారు. 

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా
కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌లో జనం ఇండ్లలోనే ఉండి ఫుడ్‌‌‌‌‌‌‌‌, గ్రాసరీస్‌‌‌‌‌‌‌‌, మెడిసిన్‌‌‌‌‌‌‌‌, డ్రెసెస్‌‌‌‌‌‌‌‌ ఇలా ఎన్నో రకాల ఐటెమ్స్​ను ఆర్డర్​ చేస్తూ ఉంటారు.  ఇలా ఆన్​లైన్​ షాపింగ్​ను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు..  ఈ – కామర్స్​ వెబ్​సైట్ల పేరుతో ఫేక్​ ఫ్లాట్​ ఫామ్స్​ తయారు చేసి అమాయాకులను ట్రాప్ చేస్తారు. చూడటానికి అసలైన వెబ్​సైట్​గా కనిపించినా.. వాటి వెనకాల సైబర్​నేరగాళ్లు మాటువేసి ఉంటారని గుర్తించాలి. అందుకే ఆన్​లైన్ షాపింగ్​చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు వెబ్​సైట్ ను క్రాస్ చెక్​ చేసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. గూగుల్​లో నెటిజన్లు వెతికే ప్రొడక్ట్ ను అన్నిటికన్నా ముందే కనిపించేలా చేస్తారు. దాన్ని క్లిక్​ చేసినా, అందులోని నంబర్​కు కాల్​ చేసినా సైబర్ నేరగాళ్లు కాల్‌‌‌‌‌‌‌‌ బ్యాక్ చేస్తున్నారు. కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించి.. ఫోన్ లో ఆయా రకాల యాప్స్​ ఇన్​స్టాల్​చేయించి అకౌంట్లలోని డబ్బులను దోచుకుంటున్నారు.  వాట్సాప్, మెసేజెస్​లో వచ్చిన లింక్స్​ను క్లిక్​ చేయొద్దని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.