
మాస్ మహారాజ రవితేజ(RaviTeja).. ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు.ఈ పేరు వినగానే మాస్ ఆడియన్స్ తో థియేటర్స్ ఊగిపోతాయి. ఆడియన్స్ రచ్చ రచ్చ చేస్తారు. అలా మాస్ అనే పదానికి బ్రాండ్ గా మారిపోయారు రవితేజ. ఇండస్ట్రీ నుండి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక్కడే వచ్చి.. ఎక్కడో అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ అయ్యి.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయారు రవితేజ. అందుకే ఆయన ప్రయాణం కొన్ని లక్షల మందికి స్ఫూర్తినిచ్చింది. ఆయన్ని చూసి ఇండస్ట్రీకి వచ్చినవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. అందులో బిగ్ బాస్ అమర్ దీప్(Amar Deep) ఒకరు.
అమర్ దీప్ కి రవితేజ అన్నా, ఆయన నటన అన్నా పిచ్చి. ఆయనంటే పడిచచ్చిపోతాడు అమర్. ఇదే విషయాన్ని బిగ్ బాస్ సమయంలో చాలాసార్లు చెప్పుకొచ్చాడు అమర్. అయితే.. ఒక సందర్భంలో రవితేజ తన మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ సీజన్ 7కి వచ్చాడు. సమయంలో అమర్ దీప్ హౌస్ లో ఉన్నాడు. అప్పుడు హోస్ట్ నాగార్జున అమర్ దీప్ కి ఒక టెస్ట్ పెట్టాడు. అదేంటంటే.. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్న.. ఇప్పటికిప్పుడు నువ్వు ఇంటి నుండి బయటకు వచ్చేస్తే నీ అభిమాన హీరో రవితేజతో నటించే అవకాశాన్ని ఇప్పిస్తా. చెప్పు బిగ్ బాస్ టైటిల్ కావాలా... రవితేజతో సినిమా కావాలా అంటాడు.
దానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటకు రావడానికి సిద్దమవుతాడు అమర్ దీప్. కానీ, అమర్ ను మధ్యలోనే ఆపి రవితేజ అతనికో ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు రావాల్సిన పనిలేదు.. బిగ్ బాస్ కంప్లీట్ చేసుకొని బయటకు రా.. నా సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తాను అంటాడు. దాంతో చాలా సంబరపడతాడు అమర్ దీవ్. అయితే ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకున్నాడు రవితేజ. తాజాగా సెట్ లో రవితేజతో దిగిన ఫోటోను షేర్ చేశారు అమర్ డీప్. కాలనిజమైన రోజు. మాస్ మహారాజ్ ను కలిశాను.. అటూ రాసుకొచ్చాడు. దాంతో.. రవితేజ మాటిచ్చినట్టుగా తన సినిమాలో అమర్ దీప్ కి అవకాశం ఇచ్చాడు అంటూ కామెంట్స్ వాస్తున్నాయి. మరి అది ఏ సినిమాలో అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.