Jagapathi Babu: నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అండగా ప్రభాస్... జగ్గుభాయ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Jagapathi Babu: నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అండగా ప్రభాస్... జగ్గుభాయ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు మూడు దశాబ్దాలుగా తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ఫ్యామిలీ హీరోగా, 'శోభన్‌బాబు' వారసుడిగా మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.  అయితే నటుడి గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన బాలయ్య 'లెజెండ్' సినిమాతో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తూ బిజీగా ఉన్నారు.  లేటెస్ట్ గ్లోబల్ స్టార్ ప్రభాస్, టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గురించి జగ్గుబాయ్  చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

డిప్రెషన్ టైమ్‌లో అండగా ప్రభాస్..

ప్రభాస్ పాన్- ఇండియా స్టార్ అయినప్పటికీ, అతనిలో రవ్వంతైనా గర్వం లేదు. ఎవరికైనా స్వార్థం లేకుండా సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని  జగపతిబాబు ప్రశంసించారు  నేను తీవ్రమైన డిప్రెషన్ ఎదుర్కొంటున్న సమయంలో ప్రభాస్‌తో మాట్లాడాలనిపించింది. అప్పుడు ఆయన జార్జియాలో షూటింగ్‌లో ఉన్నాడు.

►ALSO READ | ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కున్న వరుణ్ ధావన్.. ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ ట్రైలర్ రిలీజ్!

అయినా సరే, నా పరిస్థితి తెలుసుకుని వెంటనే స్పందించాడు. 'డార్లింగ్, నేనున్నాను కదా.. నీ సమస్య ఏంటో చెప్పు, నేను సర్దుబాటు చేస్తాను అంటూ కొండంత ధైర్యం ఇచ్చాడు అని పాత రోజులను గుర్తుచేసుకున్నారు. షూటింగ్ ముగించుకుని ఇండియా రాగానే, ప్రభాస్ స్వయంగా జగపతి బాబును కలిసి మోటివేట్ చేశారట. వయసులో తనకంటే చిన్నవాడైనా, ప్రభాస్‌కు ఉన్న విశాల హృదయానికి తాను ఫిదా అయ్యానని జగ్గుభాయ్ ఎమోషనల్ అయ్యారు.

రాజమౌళి ఫ్యామిలీకి ఇగో లేదు..కానీ..
ఇక జక్కన్న రాజమౌళి గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, ఆస్కార్ వంటి ఘనతలు సాధించినా రాజమౌళి, ఆయన కుటుంబం ఎంతో ఒదిగి ఉంటారని ప్రశంసించారు. ఆ ఫ్యామిలీలో ఎవరికీ ఇగో ఉండదు. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. అయితే, వృత్తి విషయానికి వస్తే రాజమౌళి రూల్స్ వేరేలా ఉంటాయి. ఎంతటి క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, బంధువులైనా సరే.. కేవలం పాత్రకు సరిపోతారనుకుంటేనే సినిమాలోకి తీసుకుంటారు తప్ప, మొహమాటాలకు అస్సలు తావివ్వరు.

రాజమౌళి ఫ్యామిలీలో ఉన్న డిసిప్లిన్, వాల్యూస్‌లో మనం కొద్దిగా నేర్చుకున్నా జీవితంలో సక్సెస్ అవుతాం అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.  ప్రభాస్ సుగుణాలను, రాజమౌళి క్రమశిక్షణను కొనియాడుతూ ఆయన పంచుకున్న ఎమోషనల్ జ్ఞాపకాలు అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.