బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తన మార్క్ హిలేరియస్ కన్‌ఫ్యూజన్ డ్రామాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదట మే 21న విడుదల కావాల్సిన ఈ ట్రైలర్ సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యంగా, ఎలాంటి హడావుడి లేకుండా శనివారం యూట్యూబ్‌లోకి వచ్చి ఒక్కసారిగా క్రేజ్ పెంచేసింది.
ట్విస్టుల మీద ట్విస్టులు..
ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరమైన కోర్టు సీన్‌తో మొదలవుతుంది. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్ భార్యాభర్తలు. వరుణ్‌కు తండ్రి కావాలని ఆశ, కానీ మృణాల్ దానికి సిద్ధంగా లేకపోవడంతో విసుగు చెంది విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన వరుణ్, అక్కడ పూజా హెగ్డేతో ప్రేమలో పడతాడు. అయితే ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అటు మృణాల్, ఇటు పూజా ఇద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్ అవుతారు. దీంతో వరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లల తండ్రిగా వరుణ్ ధావన్ ఇరుక్కుపోయే ఈ విచిత్ర పరిస్థితి థియేటర్లలో నవ్వుల పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.
నవ్వుల హంగామా..
అంతే కాకుండా వరుణ్ తన బెస్ట్ ఫ్రెండ్ మనీష్ పాల్‌తో కలిసి చేసే హంగామా, పూజ అన్నగా జిమ్మీ షెర్గిల్ ఇచ్చే వార్నింగ్‌లు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. వరుణ్‌కు నకిలీ తల్లిగా మౌని రాయ్ ఎంట్రీ ఇవ్వడం కథను మరింత రసవత్తరంగా మార్చింది. చుంకీ పాండే, రాకేష్ బేడి, రాజేష్ కుమార్, అలీ అస్గర్ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.
►ALSO READ | Rukmini Vasanth: వైరల్ బికినీ ఫోటోలపై రుక్మిణి వసంత్ సీరియస్.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు!
జూన్ 5న థియేటర్లలోకి..
రమేష్ తౌరానీ (టిప్స్ ఫిల్మ్స్), మాక్సిమిలియన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ‘వావ్’ (WOW) సాంగ్ డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేస్తుండగా, ‘తేరా హో జావూన్’ రొమాంటిక్ ఫీల్ ఇస్తోంది, అలాగే ‘వ్యాహ్ కర్వాదో జీ’ వెడ్డింగ్ యాంథమ్‌గా దూసుకుపోతోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ క్రేజీ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
