AA22xA6: అఫీషియల్.. అల్లు అర్జున్-అట్లీ మూవీ అప్డేట్.. హీరోయిన్‌గా దీపికా పదుకొణె.. వీడియో రిలీజ్

AA22xA6: అఫీషియల్.. అల్లు అర్జున్-అట్లీ మూవీ అప్డేట్.. హీరోయిన్‌గా దీపికా పదుకొణె.. వీడియో రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-తమిళ దర్శకుడు అట్లీ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ వచ్చింది. నిర్మాణ దిగ్గజం సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ విషయాన్నీ ప్రకటిస్తూ నేడు (జూన్ 7న) స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. 'ది ఫేస్ ఆఫ్ AA22xA6' పేరుతో రిలీజ్ చేసిన దీపికా పదుకొణె స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. "విజయం దిశగా వెళ్తున్న మహారాణి. దీపికా పదుకొణెకు స్వాగతం" అంటూ మేకింగ్ వీడియో ద్వారా మేకర్స్ వెల్లడించారు. 

ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి బన్నీ యోధుడి పాత్రలో కనిపించనున్నాడనే వార్తా ఎప్పట్నుంచో వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు యోధురాలిగా, సూపర్ ఉమెన్‌గా దీపికా పదుకొణె కత్తి పట్టి యాక్షన్ చేసే కొన్ని సీన్స్, ఫోటోలు వీడియోలో చూపించారు. దాంతో అల్లు అర్జున్ యోధుడి పాత్ర గురించి క్లారిటీ వచ్చేసింది.

ఈ క్రమంలో బన్నీకి జోడిగా మరో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరుని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు టాక్. మరో హీరోయిన్గా దిశా పటాని లేదా శ్రద్ధా కపూర్, అనన్య పాండే వంటి హీరోయిన్స్ లైన్ లో ఉన్నారు. కానీ, ఇప్పటివరకు వీరిలో ఎవరినీ ఖరారు చేయలేదని తెలుస్తోంది. అతి త్వరలోనే AA22లో నటించబోయే మరో హీరోయిన్స్ ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇది అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా కాగా, అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఈ ఏడాది చివరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంచనా. అందులో రూ.200 కోట్ల నిర్మాణ వ్యయంతో పాటు రూ.250 కోట్ల VFX పనులకు కేటాయిస్తున్నట్లు సమాచారం.