లవ్, పెయిన్, ఎమోషన్.. ఈ మూడు కలిస్తే వచ్చే కిక్కే వేరు.. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఇంటెన్స్ ఎమోషన్స్‌తో థియేటర్లలో రచ్చ లేపడానికి రెడీ అవుతోంది 'దీవానా' సినిమా. టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ హర్షిత్ రెడ్డి, స్నేహా మణిమేగలై లీడ్ రోల్స్ నటిస్తున్న ఈ ప్యూర్ రొమాంటిక్ డ్రామా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ సంగీశెట్టి ఈ చిత్రాన్ని వెండితెరపై ఒక ఎమోషనల్ రైడ్‌లా మలిచినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
'డెడికేటెడ్ టు ఆల్ వన్-సైడెడ్ లవర్స్'
ట్రైలర్ ఆరంభంలో పడిన ఈ ఒక్క క్యాప్షన్ చాలు.. వన్-సైడెడ్ లవర్స్ గుండెల్లో ఈ సినిమా ఎంతలా గుచ్చుకోబోతుందో చెప్పడానికి. హీరోయిన్ 'అమ్ము' పేరును చేతిపై టాటూ వేయించుకునే రేంజ్ ప్రేమలో పడతాడు హీరో.. ఆమెపై ఈగ వాలినా ఒప్పుకోడు. అమ్ము గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే, ఆఖరికి ప్రాణ స్నేహితులనైనా సరే నడిరోడ్డుపై కొట్టేంత ఇంటెన్సిటీ అతనిది.
రిజెక్ట్ చేసినా.. ..
ఆమె కోసం పేరెంట్స్‌ను కూడా కాదనుకుని, అమ్ము ప్రతి అవసరాన్ని తీరుస్తూ.. నీడలా రక్షిస్తుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, అమ్ముకి ఇతని ప్రేమ అస్సలు నచ్చదు. మరి అంతలా రిజెక్ట్ చేసినా, ఆ వన్-సైడెడ్ లవ్ సక్సెస్ అయిందా? అమ్ము మనసు కరిగిందా? అనేది జూన్ 19న థియేటర్లలోనే చూడాలి.
ALSO READ : ‘పెద్ది’ వారం రోజుల కలెక్షన్స్ అనౌన్స్..
రిలీజ్ ఎప్పుడంటే?
ఎప్పుడూ సాఫ్ట్ అండ్ బ్రీజీ రోల్స్ చేసే హర్షిత్ రెడ్డి, ఈసారి రగ్గడ్ లుక్‌లో ఊరమాస్ ఇంటెన్సిటీతో సర్ప్రైజ్ చేశాడు. స్నేహా మణిమేగలై స్క్రీన్ ప్రెజెన్స్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఝాన్సీ, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. అర్హా మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈశ్వర్ చంద్ అందించిన మ్యూజిక్ సినిమాకు మెయిన్ పిల్లర్ కానుంది. మరి జూన్ 19న ఈ లవ్ అండ్ పెయిన్ థియేటర్లలో ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి.
