PEDDI OTT: ‘పెద్ది’ వారం రోజుల కలెక్షన్స్ అనౌన్స్.. ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్

PEDDI OTT: ‘పెద్ది’ వారం రోజుల కలెక్షన్స్ అనౌన్స్.. ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద స్టేబుల్ కలెక్షన్స్ రాబడుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ వారం రోజుల్లో రూ.345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియా వైడ్గా రూ.187కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడానికి పరుగులు తీస్తోంది. 

అయితే, ఇక్కడ వచ్చిన సమస్యల్లా.. మరో వారం రోజుల్లోపే తెలుగులో దాదాపు ఐదు కొత్త సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలు కనుక గట్టి పోటీ ఇస్తే ‘పెద్ది’ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశముంది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న స్టేబుల్ కలెక్షన్స్ బట్టి చూస్తే ఈ వీకెండ్లోనే సినిమా పూర్తి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి

OTTలో అన్‌కట్ వెర్షన్?

పెద్ది డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పెద్ది ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, థియేట్రికల్ వెర్షన్‌కు భిన్నంగా, డిలీట్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ను జోడించి అన్‌కట్ వెర్షన్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా థియేట్రికల్ రన్ ముగిసిన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ‘పెద్ది’ జూలై చివరి వారం లేదా ఆగస్టు తొలి వారంలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.