Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్.. దేవర కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్.. దేవర కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) తెరెకక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత తారక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. సాంగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ మినహా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ట్రై చేశారు మేకర్స్. 

కానీ, అనుకోని విధంగా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ ఆలీఖాన్ కు ప్రమాదం జరగడంతో దేవర సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఇక అప్పటినుండి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ దేవర కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అక్టోబర్ 10న థియేటర్స్ లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో పాటు ఎన్టీఆర్ కు సంబందించిన పవర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయితే దేవర రిలీజ్ డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ గానే ఉన్నా.. కొంత వరకు డిజప్పాయింట్ అవుతున్నారు. ఏప్రిల్ లో వస్తుందనుకున్న దేవర మహా అయితే  ఒకటి లేదా రెండు నెలలు పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు. కానీ, మేకర్స్ ఏకంగా ఎనిమిది నెలలు పోస్ట్ పోన్ చేశారు. దీంతో కొన్ని రోజుల్లో తమ అభిమాన హీరోను తెరపై చేస్తామన్న ఫ్యాన్స్ కాస్త ఫీలవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.