SSRMB: రాజమౌళి, మహేష్ కాంబో టైటిల్ ఇదేనా.. ఆ రేంజ్ లేదేమో భయ్యా!

SSRMB: రాజమౌళి, మహేష్ కాంబో టైటిల్ ఇదేనా.. ఆ రేంజ్ లేదేమో భయ్యా!

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ నుండి భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఇప్పటినుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండనుందని అందరు భావిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం పవర్ ఫుల్ కథను ఇప్పటికి సిద్ధం చేశారట రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. 

SSRMB వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐన క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రేడ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు మహారాజా అనే టైటిల్ ను అనుకుంటున్నారట మేకర్స్. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ టైటిల్ ట్రెండ్ అవుతూనే ఉంది. దీంతో ఇదే టైటిల్ ను మహేష్ బాబు సినిమాకు ఫిక్స్ చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : నాలాగే స్వయంకృషితో.. మెగాస్టార్ మాటలకు ఏడ్చేసిన వైవా హర్ష 

ఇదిలా ఉంటే.. మహారాజా టైటిల్ పై అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు నార్మల్ ఆడియన్స్ కూడా అంత సంతృప్తిగా లేరని అర్థమవుతోంది. మహారాజ టైటిల్ బయటకు వచ్చిన సమయం నుండి ఫ్యాన్స్ ఒకటే మాట అంటున్నారు. మహేష్, రాజమౌళి కాంబోలో వచ్చే సినిమాకు ఉండాల్సిన రేంజ్ లో టైటిల్ లేదు. ఇంకా చాలా టైం  ఉంది కదా ఎందుకు తొందర అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమందేమో ఎక్కడో కొడుతోంది జక్కన్నా.. తొందరపడకండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాకు మహారాజా అనే టైటిల్ అనుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చేయండి.