
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు దుమ్ము రేపుతూనే ఉంది. రిలీజైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నేడు (జూన్25న) ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి వసూళ్ల వివరాలు వెల్లడించారు. జూన్ 20న థియేటర్లలో రిలీజైన కుబేర ఇండియా బాక్సాఫీస్ దగ్గర రూ.62.98 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం రూ.100కోట్ల క్లబ్‍లోకి అడుగుపెట్టడం విశేషం.
Wealth. Wisdom. And now... ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥
— Annapurna Studios (@AnnapurnaStdios) June 25, 2025
Book your tickets now: https://t.co/2SeT2s39Yb #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/glVl4tSGjt
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. ఓ బడా ధనవంతుడి లక్ష కోట్ల స్కామ్, అందులో ఇరుక్కుపోయిన అనామకమైన ఓ బిచ్చగాడి మధ్య పోరాటాన్ని థ్రిల్లింగ్గా తెరకెక్కించాడు శేఖర్.
ధనుష్ నటించిన బిచ్చగాడి పాత్రకు సోషల్ మీడియాలో అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. రష్మిక మరియు నాగార్జున స్క్రిప్ట్‌ల ఎంపికకు ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపించారు. శేఖర్ కమ్ముల ఆకట్టుకునే కథ మరియు భావోద్వేగ సన్నివేశాలు సినిమాను నడిపిస్తున్నాయి.
►ALSO READ | EmraanHashmi: డెంగ్యూను జయించిన ‘ఓజీ’ విలన్.. ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి తిరిగి బరిలోకి
డైరెక్టర్ శేఖర్ కమ్ముల థ్రిల్లర్ ఎలిమెంట్లతో పాటు సమాజంలోని పరిస్థితులను కూడా బలంగా చూపించారు. కార్పోరేట్ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు.
ఇందుకోసం దర్శకుడు శేకర్ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసిన తీరు కథలో కనిపిస్తుంది.అంతేకాకుండా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించింది.
కుబేర బడ్జెట్:
భారీ క్యాస్టింగ్తో.. దాదాపు రూ.120-150 కోట్ల బడ్జెట్తో కుబేర తెరకెక్కింది. ఈ మూవీకి తమిళ, తెలుగు మార్కెట్స్‌లో థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. తమిళంలో రూ.20 కోట్లు, తెలుగులో రూ.40 కోట్లు, ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5 కోట్లు చొప్పున మొత్తంగా రూ.65 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సినీ వర్గాల సమాచారం. అంటే.. ఈ లెక్కన కుబేర మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.66 కోట్ల షేర్, రూ.132 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
శేఖర్ కమ్ముల విజన్:
కేవలం భావోద్వేగాలపై కథను నడిపించడం, అందులో ఒక సామజిక అంశాన్ని చూపించడం కమ్ముల స్పెషాలిటీ. అలా వచ్చినవే.. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు. ఆయన సినిమాల్లో హీరోయిజం ఉండదు. కథే ఆయన బలం. అందుకే ఆయన సినిమాలకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి దర్శకత్వ మార్క్ తోనే కుబేర ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాతో అతని మార్క్‌ను ఒక మెట్టుపైనే ఉంచారు కానీ, కిందికి మాత్రం పడెయ్యలేదని ప్రూవ్ అయింది.