కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం ఆయన కొత్త సినిమా కాదు.. ఆయన అభిమాన సంఘం ఆవిష్కరించిన అధికారిక జెండా. ఈ జెండా విడుదలైన వెంటనే తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్ అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాట మరో హీరో రాజకీయ ఆరంగేట్రానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నాడా? అంటూ అప్పుడే పొలిటికల్ డిస్కషన్స్ మొదలైపోయాయి
ధనుష్ మాస్ లుక్!
వైరల్ అవుతున్న ఆ జెండాలో ధనుష్ చేతులు జోడించి నమస్కరిస్తున్న పోజ్‌లో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎరుపు, తెలుపు రంగులతో డిజైన్ చేసిన ఫ్లాగ్... రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉండటంతో అందరి చూపు దానిపైనే పడింది. దీంతో అభిమానులు మాత్రమే కాదు... రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. మాస్ లీడర్‌గా ధనుష్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ ప్లాన్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
The official flag of the Dhanush Fans Welfare Association has been unveiled.
— Vignesh Theni (@Vignesh_twitz) July 5, 2026
எண்ணம் போல் வாழ்க்கை
எண்ணம் போல் தான் வாழ்க்கை pic.twitter.com/sfBqIDW4fI
హిస్టరీ రిపీట్ అవుతుందా?
తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, కెప్టెన్ విజయ్ కాంత్, కమల్ హాసన్, దళపతి సీఎం విజయ్ (TVK పార్టీ) వరకు అందరూ సినిమా గ్లామర్.. ఫ్యాన్ బేస్‌తోనే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనాలు సృష్టించారు. ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ నెట్‌వర్క్ కూడా అదే దారిలో నడుస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తమిళనాడులో బలమైన అభిమాన సంఘాలు ఉన్న ధనుష్, భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వస్తే సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ALSO READ : శర్వా-శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఫిక్స్?
ధనుష్ రియాక్షన్ ఏంటి?
అయితే, ఈ హడావిడి అంతా ప్రస్తుతానికి ఫ్యాన్స్ క్లబ్ స్థాయిలోనే జరుగుతోంది. దీనిపై అటు ధనుష్ గానీ, ఇటు ఆయన పీఆర్ టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్, కేవలం తన అభిమానుల గుర్తింపు కోసమే ఈ జెండాను అనుమతించారా? లేక దీని వెనుక ఏదైనా లాంగ్ టర్మ్ పొలిటికల్ స్కెచ్ ఉందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా తమిళ రాజకీయాల్లో ఈ 'జెండా' మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ALL INDIA DHANUSH FAN CLUP ♥️Dhanush flag event launch @dhanushkraja @DhanushFc @B_RAJA_ @dhanushkraja @Chowdrey_Pro @Dhanushvijay28 @DhanushAppuVK @vpm_kallai_dfc pic.twitter.com/e9okDUPnrZ
— _umar_babu_.⓿➌➋➊ (@Umarbabu21) July 5, 2026
