శర్వానంద్ హీరోగా శ్రీసు వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా సన్నాహాలు చే స్తున్నారట. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ చెప్పారు.
UPDATE:
— Telugu Chitraalu (@CineChitraalu) June 17, 2026
Actor #Sharwanand is teaming up with Srinu Vaitla for a romantic commercial entertainer titled as “George Krish”.
Actress #PreityMukundhan has been selected as the female lead.
Initially, the project was planned under Mythri Movie Makers. However, AK Entertainments'… pic.twitter.com/Jk1ez2ng4X
ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో సంక్రాంతి బరిలో సూపర్ హిట్స్ అందుకున్న శర్వానంద్.. మరోసారి ఈ సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావాలని ఫిక్స్ అయ్యాడు.
ఇందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత శ్రీనువైట్ల మూవీ నుంచో అనౌన్స్ మెంట్ అవకాశం ఉంది.
