బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‎పై తీర్పు రిజర్వ్

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‎పై తీర్పు రిజర్వ్

హైదరాబాద్: పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‎పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సోమవారం (జులై 6) ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా బండి భగీరథ్‎కి బెయిల్ మంజూరు చేయొద్దని భాదితురాలి తరుపు లాయర్ వాదించారు. 

బండి భగీరత్ తండ్రి ఒక కేంద్ర మంత్రి కాబట్టి.. దర్యాప్తు దశలో నిందితుడికి బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ కేసులో ఇంకా సాక్షులను విచారణ చేయాల్సి ఉందని.. నిందితుడు బెయిల్‎పై బయటకు వస్తే సాక్షులు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉందని వాదించారు. బండి భగీరత్ జైల్లో ఉంటేనే కేసు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరుగుందని వాదనలు వినిపించారు. 

పేట్ బషీరాబాద్ పోలీసుల కౌంటర్ దాఖలు

బండి భగీరథ్‎కి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. నిందితుడిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామని.. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశాక ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో అభియోగాలను సవరించామని కోర్టుకు తెలిపారు.

ALSO READ : ఇందిరమ్మ ఇండ్ల పథకంను పీఎం కూడా మెచ్చుకున్నారు: మంత్రి వివేక్ 

బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం చేసుకుని, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసుల తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. భగీరథ్ బెయిల్ పిటిషన్‎పై తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో భగీరథ్‎కు బెయిల్ వస్తుందా.. రాదా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.