అయోధ్య విరాళాల స్కామ్‎లో కీలక పరిణామం.. చంపత్ రాయ్ రాజీనామాకు ట్రస్ట్ ఆమోదం

అయోధ్య విరాళాల స్కామ్‎లో కీలక పరిణామం.. చంపత్ రాయ్ రాజీనామాకు ట్రస్ట్ ఆమోదం

లక్నో: అయోధ్య రామ మందిర విరాళాల స్కామ్‎లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామ మందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాజీనామాకు ట్రస్ట్ ఆమోదం తెలిపింది. చంపత్ రాయ్‎తో పాటు అనిల్ మిశ్రా రాజీనామాకు సైతం ట్రస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, అయోధ్య రామ మందిర విరాళాల్లో గోల్ మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంపత్ రాయ్ ప్రధాన అనుచరుడు టిన్ను యాదవ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

దీంతో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేశారు. అలాగే, ట్రస్ట్ మెంబర్ వినోద్ మిశ్రా సైతం తన పదవికి రిజైన్ చేశారు. రామ మందిర విరాళాల గోల్ మాల్ ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ సోమవారం (జులై 6) కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో చంపత్ రాయ్, వినోద్ మిశ్రాల రాజీనామాకు ఆమోదం తెలిపింది. 

అయోధ్య రామ మందిరంలో విరాళాలు స్వాహా

కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య రామాలయంలో అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. రామయ్యకు భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలను కొందరు స్వాహా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో పలువురిని విచారించిన సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది. ఆలయంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, విశ్వహిందు పరిషత్ అగ్రనేత చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు.