Dhurandhar 2 Box Office: 'పుష్ప' రికార్డులు బద్దలుకొట్టిన ‘ధురంధర్’.. అల్లు అర్జున్‌ను దాటేసిన రణవీర్ సింగ్!

Dhurandhar 2 Box Office: 'పుష్ప' రికార్డులు బద్దలుకొట్టిన ‘ధురంధర్’.. అల్లు అర్జున్‌ను దాటేసిన రణవీర్ సింగ్!

భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అదే ‘ధురంధర్’. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. మేకర్స్ కు కాసుల వర్షం కురిపిస్తోంది . గతంలో ఉన్న రికార్డులను ఒక్కొక్కటి దాటుకుంటూ దూసుకెళ్తోంది. 2026, మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, కేవలం వారం రోజుల్లోనే భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో ప్రకంపనలు పుట్టిస్తోంది.

పుష్పరాజ్‌ను దాటేసిన ధురంధర్!

తాజా ట్రేడ్ విశ్లేషణల ప్రకారం, ‘ధురంధర్’ ఫ్రాంచైజీ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ రికార్డులను ఇది అధిగమించింది. పుష్ప ఫ్రాంచైజీలోని రెండు భాగాలు కలిసి ఇప్పటివరకు దాదాపు రూ. 2000 కోట్ల వసూళ్లను సాధించగా, ‘ధురంధర్’ సిరీస్ కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 2100 కోట్ల మార్కును దాటేసింది. దీనితో భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన 3వ అతిపెద్ద ఫ్రాంచైజీగా అవతరించి హిస్టరీ క్రియేట్ చేసింది.

బాక్సాఫీస్ వద్ద విధ్వంసం

రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా ఈ మూవీ నిలిచింది. ఈ ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా  రూ. 829.76 కోట్లు రాబట్టింది. వారాంతంలోనే కాదు, వర్కింగ్ డేస్‌లో కూడా ఈ సినిమా రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుండటం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ఈ వీకెండ్ ముగిసేలోపు రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.

►ALSO READ | పాప పరిహారం దిశగా ఆర్జీవీ.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోలతో 'సిండికేట్' మూవీ!

టార్గెట్ 'బాహుబలి' 

ప్రస్తుతం ధురంధర్ జోరు చూస్తుంటే, రెండవ స్థానంలో ఉన్న 'బాహుబలి'  ఫ్రాంచైజీ రూ. 2400 కోట్లు రికార్డును మరికొన్ని రోజుల్లోనే తుడిచిపెట్టేలా ఉంది. అయితే, మొదటి స్థానంలో ఉన్న బాలీవుడ్ ప్రతిష్టాత్మక ‘వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్’ (YRF Spy Universe) రూ. 3195 కోట్లతో అందనంత ఎత్తులో ఉంది. ఆదిత్య ధర్ మేకింగ్ వాల్యూస్, రణవీర్ పర్ఫార్మెన్స్ తోడైతే, ఆ రికార్డు కూడా చెదిరిపోవడం అసాధ్యమేమీ కాదని అటు విశ్లేషకులు భావిస్తున్నారు.

తారాగణం - 
ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు ఆర్‌. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు నటించడం సినిమాకు భారీ హైప్‌ను తీసుకొచ్చింది. రాకేష్ బేడీ, డేనిష్ పాండోర్, సారా అర్జున్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గూఢచారి వ్యవస్థ, దేశభక్తి,  రివెంజ్ డ్రామా కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక ‘లార్జర్ దాన్ లైఫ్’ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. మొత్తానికి, ఆదిత్య ధర్ తన శిష్యరికం నుంచి బయటకు వచ్చి, గురువు ఆర్జీవీ గర్వపడేలా ఇండియన్ బాక్సాఫీస్ మ్యాప్‌ను మార్చేస్తున్నారు .