SRH vs Rohit Sharma: SRHని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన రోహిత్.. ఎందుకో తెలుసా..?

SRH vs Rohit Sharma: SRHని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన రోహిత్.. ఎందుకో తెలుసా..?

SRH vs Rohit Sharma: భారత క్రికెట్ స్టార్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అన్‌ఫాలో చేశాడనే వార్త వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌లో నిర్వహించే హండ్రెడ్ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఈ ప్రచారం మొదలైంది. హండ్రెడ్ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ సుమారు 2.55 లక్షల అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసింది. పాకిస్థాన్ ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు నిషేధం ఉంది. దీంతో భారత యాజమాన్యంలోని ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌లలో కూడా అదే విధానాన్ని పాటించాలని కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ఎస్‌ఆర్‌హెచ్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.

ఈ వివాదం తర్వాత రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అన్‌ఫాలో చేశాడని ఒక పోస్టు వైరల్ అవుతుంది. దాన్ని పరిశీలిస్తే అది తప్పుదోవ పట్టించే సమాచారం అని తేలింది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఫాలో కావ్వడం లేదు.. కానీ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆయన అన్‌ఫాలో చేశాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తప్ప ఇతర ఐపీఎల్ జట్లను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయడం లేదు. ప్రస్తుతం ఆయన కేవలం 112 అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నారు. వాటిలో ఎక్కువగా క్రికెటర్లు లేదా బ్రాండ్లు మాత్రమే ఉన్నాయి.

ALSO READ : పాక్ ప్లేయర్ సర్ఫరాజ్ రిటైర్మెంట్..

ఇక అబ్రార్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోవడంపై సన్‌రైజర్స్ లీడ్స్ కోచ్ డేనియల్ వెట్టోరి స్పందించాడు. జట్టుకు ఒక మంచి స్పిన్నర్ అవసరమని తీసుకున్నాం.. వేలంలో మొదట ఆదిల్ రషీద్‌ను ప్రయత్నించినప్పటికీ అవకాశం లేకపోవడంతో అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపాడు. అబ్రార్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది, అతని బౌలింగ్‌ను చాలా మంది ఆటగాళ్లు ఎదుర్కోలేదని పేర్కొన్నాడు. అలాగే వేలంలో ఇతర అంతర్జాతీయ స్పిన్నర్లు కూడా ఉన్నప్పటికీ అబ్రార్ అహ్మద్ జట్టుకు ప్రధాన ఎంపికగా నిలిచాడని వెల్లడించాడు. కాగా సన్‌రైజర్స్ లీడ్స్ అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేసిన తర్వాత రోహిత్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అన్‌ఫాలో చేశాడనే వార్త పూర్తిగా ఫేక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టు నిజం కాదని తేలింది.