Anudeep: అనుదీప్ లిస్టులోకి మెగాస్టార్..కాస్తా ఆలోచించాలి బాస్!

Anudeep: అనుదీప్ లిస్టులోకి మెగాస్టార్..కాస్తా ఆలోచించాలి బాస్!

జాతిరత్నాలు (Jathirathnalu) సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అనుదీప్ (Anudeep). దీంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అనుదీప్. అదే ఊపుతో రెండు సినిమాగా ప్రిన్స్ సినిమాను తెరకెక్కించాడు. తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ రిజల్ట్ ను మూటగట్టుకుంది. దీంతో కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు అనుదీప్. 

లేటెస్ట్గా అనుదీప్ మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.అది మాములు మిడిల్ రేంజ్ హీరో అయితే కాదు..మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో అని టాక్ వినిపిస్తోంది. అనుదీప్ సరైన స్టోరీ రెడీ చేస్తే..చిరు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదివరకే రెండుసార్లు అనుదీప్ తో మాట్లాడిన చిరు..అనుదీప్ చెప్పిన స్టోరీ లైన్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

అయితే, ఇక్కడ వచ్చిన పెద్ద ఇస్స్యూ ఏంటంటే..చిరంజీవి లాంటి మెగాస్టార్ తో సినిమా చేయడం ఆషామాషీ కాదు. తనదైన కామెడీతో సినిమాలు చేసే అనుదీప్ చిరుకి ఎలాంటి స్టోరీ చెప్పాడో తెలియాల్సి ఉంది. కామెడీ పరంగా అయితే ఒకే కానీ, యాక్షన్ పరంగా కాస్తా డౌట్ అనే టాక్ అయితే వస్తోంది. మరి చిరు అలోచించి అనుదీప్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉందని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది. 

అలాగే,అనుదీప్ తన నెక్స్ట్ సినిమాను మాస్ మహారాజ్ రవితేజతో చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్టు గురించి ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉండాలి సమాచారం కూడా తెలుస్తోంది. 

అంతేకాదు ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రద్దా శ్రీనాథ్ ను సెలెక్ట్ చేశాడట అనుదీప్. జాతిరత్నాలు తరహాలోనే అవుట్ అండ్  కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి..ఈ ఇయర్ ఎండింగ్ లో సినిమా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి అనుదీప్ ఎవరితో ప్రాజెక్ట్ సెట్ చేశాడో అనేది తెలియాల్సి ఉంది.