Venkatesh: వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి రేపే!..మరి చప్పుడేలేదుగా

Venkatesh: వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి రేపే!..మరి చప్పుడేలేదుగా

దగ్గుబాటి (Daggubati) వారింట పెళ్లి సందడి మొదలైందని సమాచారం. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)-నీరజ (Neeraja)ల రెండో కూతురు హవ్యవాహిని (Havyavahini) రేపు (మార్చి 15న) పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ 25న రాత్రి హవ్యవాహిని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుక‌కు చిరంజీవి,మ‌హేష్ కూడా హాజ‌ర‌య్యారు. 

ఇక ఆ త‌ర్వాత పెళ్లి తేది వివరాలు బయటికి వినిపించలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..రేపు (మార్చి 15న) పెళ్లి తేదీగా నిశ్చ‌యించిన‌ట్లు సమాచారం.దగ్గుబాటి వారి పెళ్లి సందడి హైద‌రాబాద్ లో జ‌రుగుతుందని తెలుస్తోంది. అయితే ఈ విష‌యాలేవి ఇంత‌వ‌ర‌కూ మీడియాలో ఎక్క‌డా లీక్ కాకపోవడం వల్ల ఎటువంటి హడావుడి అయితే కనిపించట్లేదు.ఇప్ప‌టికే మెహందీ..సంగీత్ వంటి ఈవెంట్స్ కూడా షురూ  అయిన‌ట్లు టాక్. 

వెంక‌టేష్ రెండ‌వ కుమార్తె హవ్యవాహిని దగ్గుబాటి, వైద్య కుటుంబం నుంచి వచ్చి స్వయంగా డాక్టర్ అయిన విజయవాడకు చెందిన వరుడిని వివాహం చేసుకోబోతోంది. రామానాయుడు స్టూడియోస్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి వేడుక జరుగుతోందని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లి వేడుక మాత్రం మార్చి లాస్ట్ వీక్ లో అవుతున్నట్టు మరికొన్ని వార్తలయితే వస్తున్నాయి. మరి రేపటి వరకు ఆగితే..వెంకీ మామ వారి ఇంట సందడి ఏంటనే విషయం అర్ధమవుతోంది.